









Chennamaneni Vidyasagar Rao
Indian politician, Former Maharashtra Governor

Ande Sri
Poet and Lyricist

Jonnalagadda Snehaja
Regional Passport Officer of Hyderabad

Inampudi Shreelaxmi
Aksharayan Founder,Writer

Sri Baisa Devadas
Editor of Neti Nijam

Shri Vamsi Ramaraju
Vegesna Foundation Founder

Dr Sarojana Banda
Writer

Dr. Sammeta Vijaya
Teacher, Writer, Theatre Researcher

Aksharayan Award Winners
Dr. Thallapalli Yakamma

V. Prathima

V. Prathima

V. Prathima

V. Prathima

Muktevi Bharathi

Annangi Venkata Seshalakshmi

Kuppambika Award
Devanapalli Veena Vani

Kuppambika Award
Chukkayapalli Sridevi

Dr. Aluri Vijayalakshmi

Rangajamma Award
Dr Vasundhara Reddy

Aksharayan Yuva Rachayithri Award
Sri Chandana Rachuri

Aksharayan Yuva Rachayithri Award
Renuka Eedholla

Vishnavi Thadapakal

Aksharayan Balika Award
Anjana Sathwika

Aksharayan Balika Award
B Sai Naveena

Laxmi Ganesh Narsimhulapally

Revanth Goud

EVENT VIDEO
EVENT VIDEOS
మాతృభాష ఔన్నత్యాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని మహరాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. అక్షయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫౌం డేషన్ ఆధ్వర్యంలో బుధవారం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరి గాయి. ఈ సందర్భంగా ప్రముఖ కవి అందెశ్రీకి పంపకవి పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ ప్రపంచంలో 40 శాతం మంది తమ మాతృభా షలో చదవలేకపోతున్నారన్నారు. ఫిబ్రవరి 21న ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నామని, కేవలం వేడుకలకే పరి మితం కాకుండా తెలుగు భాష గొప్పతనాన్ని నేటి యువతకు చేరేలా కవులు, రచయితలు తమ కలాలకు పదునుపెట్టాలన్నారు. లిపిలో కొరియా భాష తర్వాత తెలుగు భాషకు అంత ప్రాధాన్యం ఉందన్నారు. తెలుగు భాషకు అద్భు తమైన వ్యాకరణం ఉందన్నారు. స్వర్గీయ పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో స్పానిష్ దేశానికి చెందిన వారు ఇంటర్వ్యూ చేసేందుకు రాగా వారితో పీవీ ఆంగ్లంలో మాట్లాడగా వారికి ఇంగ్లిష్ రాకపోవడంతో స్పానిష్‌లో ప్రశ్నలు అడిగారన్నారు. పీవీ సైతం స్పానిష్ భాషలో సమాధానాలు చెప్పడంతో వారు పీవీ బహుభాషా పాండిత్యాన్ని కొని యాడారని గుర్తుచేశారు. ప్రభుత్వాలు విద్య వైద్యం కోసం అధికంగా నిధులు ఖర్చు చేయా లన్నారు. తెలుగులో మంచి రచనలు చేసి అంత ర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. వచ్చే ఏడాది మాతృభాషా దినోత్సవం విదేశాల్లో నిర్వహించి తెలుగు భాష ఖ్యాతిని చాటి చెప్పాలన్నారు.
అందరిదీ తెలంగాణ: పంపకవి పురస్కార గ్రహీత అందెశ్రీ.. “ఒక్కడు లెక్కలేసుకుంటే తెలంగాణ వచ్చింది కాదని.. పురుడు పోసుకున్న పసికూనల నుంచి కాటికి కాలుసాచే వారు పోరాడితే వచ్చిందే తెలంగాణ..అందరిదీ తెలంగాణ.. ఐదేళ్లు కాక పోతే పదేళ్లు ఏలుకోండి.. ఎల్లకాలం ఏలడానికి ఎవరి తాత జాగీరు కాదు” అంటూ పంపకవి పురస్కార గ్రహీత అందెశ్రీ అన్నారు. తనకు తన భాష తప్ప మరో భాష రాదన్నారు. “నా ఊరు తెలంగాణ.. నా పేరు తెలంగాణ.. నా తల్లి తెలం గాణ..నా నిలువెల్లా తెలంగాణ.. నా పాట తెలం గాణ.. సై ఆట తెలంగాణ” అని తనదైన శైలిలో భాషా గొప్పతనాన్ని వివరించారు. నైజామోడికి పైజామా ఊడగొట్టింది.. రజాకార్ల మూకలను తరిమికొట్టింది.. గడీలకు అగ్గిపెట్టింది.. రాజరికా నికి ఘోరీ కట్టింది తెలంగాణ అన్నారు. తెలం గాణ అంటే పిడికిలి మట్టి కాదని, పోరాటాల గడ్డ అన్నారు. ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదని, గతంలోనే సారుకు చెబితే ఏడేళ్లు నాతో మాడ్లాడ లేదన్నారు అనంతరం తెలుగు భాషకు సేవ చేసిన వంశీరామరాజు, నేటినిజం దేవదాస్, సరోజ, చెన్నమనేని పద్మజ, సుధామలను సన్మా నించారు. కార్యక్రమంలో రీజనల్ పాస్‌పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ, అక్షరయాన్ వ్యవస్థాపకురాలు శ్రీలక్ష్మి. ప్రతినిధులు సమ్మెట విజయ, యశోధ, మల్లీశ్వరి, విశ్వైకం, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
RECENT PUBLICATIONS
అక్షరయాన్ – తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్