సంక్రాంతి వేళ సంబరాల హేల. ఊరుఊరంతాను ముస్తాబు పట్నం వారికి పిలుపుల జాబు. చలి పొద్దుపొడుపులో నులివెచ్చని భోగిమంటలు. భోగిపాటల అలరింతలు ముంగిళ్లలో అందాల హరివిల్లులు. గొబ్బెమ్మలతో అమరిన రంగవల్లికలు మామిడాకుల తోరణాలు. కొత్తబట్టల సోయగాలు పిండివంటల ఘుమఘుమలు. కొత్తపొంగలి మధురిమలు గాలిపటాల రెపరెపలు. చెరుకు గడలలో తీపిదనాలు కొత్త అల్లుళ్లకు అతిథిమర్యాదలు. హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల ఆటలు . పిట్టలదొర కోతలు పగటివేషగాళ్ళ పాటలు జంగమదొరలు, కాటికాపరులు కాడెద్దుల పందాలు, కోడి పందాలు కోలాటమాటలతో వీధి కూడళ్ళు ఎడ్లపందాలు, కోడి పందాలు. పండంటి పాపాయిలకు భోగి పళ్ళ దీవెనలు. బొమ్మలతో కొలువులు భోగభాగ్యాల నెలవులు. పశువులకు పూజలు పనివారికి బట్టలూ, ధాన్యాలు అందాల సంక్రాంతి ఆనందాలు పంచుతుంది. తన వారినందరినీ తట్టి చూసుకుంటుంది. సాహితీ కాన్వాసుపై సంక్రాంతి సరికొత్త కవితల పూలదండలల్లుతుంది.
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై