పెద్ద పండు గ వస్తోంది మూడు రోజల సందడి తెస్తుంది. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి జంటగా ఇంటికి రాగా యజమాని మోము ఆనందంతో కళకళలాడుతుంది కన్న బిడ్డలు, వారు కన్నబిడ్డలు, జీవిత భాగస్వాములతో పండుగకి తరలిరాగా,శ్రమ పెరిగినా ఇల్లాలు సంబర పడిపోతుంది దిష్టి పోవాలని పిల్లలకు భోగి పళ్లు, చలిపోవాలని అందరికీ భోగిమంటలు కాకిరూపు పోవాలని పిల్ల, పెద్దల కనుము స్నానాలు.. కుప్పనూర్పిళతో దిక్కు తోచక ఊరిపై పడిన దోమల, నుసుల్ల, క్రిమికీటకాల నివారణకు పేడనీళ్ళ కళ్ళాపులు, ఇంటి ముంగిట ముగ్గుతో రంగవల్లులు, మధ్యలో కనులకు అందం, ప్రశాంతత నిచ్చే గొబ్బెమ్మలు. శరీరానికి అవసరమయ్యే నువ్వుండలు, అరిసెలు, చకినాలు అన్నీ సంప్రదాయ, ఆరోగ్య ప్రతీకలే. కోడిపందాలు, ఎడ్లపందాలుతో పల్లెలు సందడి చేస్తుంటే కష్టమైనా, కూడదని తెలిసినా ఇష్టముగా పాల్గొనే జనాలు హరిదాసుల కీర్తనలు, తోలుబొమ్మలాటలు, కన్నులకు, వీనులకు విందు చేయగా పరవశిస్తాయి ఆనందముతో అందరి మనస్సులు . నింగి కేగిరిన పత౦గులు మన చంద్రయాన్, ఆదిత్య, ఆస్కార్, క్రీడల్లో పసిడి పతకాలను గుర్తు చేస్తుంటే గర్వముగా, ఆనందముగా ఈ సంక్రాంతి తెచ్చే కొత్త కాంతికి స్త్రీ ఆత్రముగా ఎదురు చూస్తున్నారు జనులందరూ .
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై