ఎగిరే ఆ త్రివర్ణ పతాకం ఎందరో వీరుల త్యాగఫలం. అరణ్యంలో అమరుడైన అల్లూరి ఇంకా అక్కడే పచ్చని చెట్ల ఆకులపై చిరుజల్లుల్లో మెరుస్తున్నాడు. అజాద్ హింద్ ఫౌజ్ నినాది నేతాజీ నేటికీ గగన సీమలో మెరుస్తున్నాడు. అదిగో చిరునవ్వుతో ఉరితాడును ముద్దాడిన నా భగత్ సింగ్ నేటికీ మా గుండెల్లో అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉన్నాడు. "అహింసో పరమో ధర్మ” అన్న మా బాపూజీ బోసినవ్వులతో ఇప్పటికీ మార్గదర్శనం చేస్తూనే ఉన్నాడు. బ్రిటీష్ మూకలను పరిగెత్తించిన మహావీరులకు చరిత్ర ఎల్లవేళలా శిరస్సు వంచి నమస్కరిస్తూనే ఉంది. సలాం అంటూ చెయ్యెత్తి జై కొడుతూనే ఉంది. నా దేశం రత్నగర్భ నా దేశం పచ్చని ప్రకృతికి నిలయం. నా దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఇక్కడ శాంతికపోతాలు స్వేచ్ఛగా ఎగురుతాయి. ఇక్కడ కొండలు మాతో గుండెల నిండా ఊసులాడతాయి. పక్షులు జన జాగృతానికి జాతీయగీతాలు ఆలపిస్తాయి. నదీజలాలు మా కళ్ళకు కర్తవ్యాన్ని బోధిస్తాయి. స్వేచ్ఛా స్వాతంత్ర్యం మా నరనరాల్లో నింపిన త్యాగధనుల ఫలితానికి నిదర్శనమైన ఆ త్రివర్ణ పతాకానికి నా వందనం... అభివందనం.
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై