తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అక్షరయాన్, సీతాస్, అభిజ్ఞ భారత్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో హరిత ప్లాజా హోటల్లో “గర్భ సంచిని కాపాడుకుందాం – సమాజాన్ని బలపరుద్దాం” అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా. కామేశ్వరి మరియు డా. సూర్యప్రకాష్ పాల్గొని గర్భ సంచీ ఆరోగ్యం, మహిళల ఆరోగ్య పరిరక్షణ, అలాగే ఆరోగ్యకరమైన మాతృత్వం సమాజ అభివృద్ధికి ఎంత కీలకమో వివరించారు.
గర్భ సంచీ సంరక్షణ ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజం నిర్మించవచ్చని వారు పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడం, సమాజం మొత్తం ఈ బాధ్యతను పంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ చర్చా కార్యక్రమం ద్వారా స్పష్టమైంది.