ధనుర్మాసము లోన వచ్చె తెచ్చనిక మూడు రోజుల ముచ్చటైన ముగ్గుల పండుగ ప్రతి ఇంట వెలుగులు నింపగా వచ్చే గొబ్బెమ్మ పండుగ ముంగిట రంగవల్లులతో గుమ్మాలకు బంతిపూలతో మగువల వెలుగులతో ముస్తాబు అయిన మురిపాల పర్వం ఇంటింటికి గంగిరెద్దులతో హరిదాసుల రాకలు అంబపలుకు జగదంబపలుకుతో గోమాత ఆశీర్వచనాలు నువ్వుల ముద్దతో తలంటడాలు నూతన వస్త్రములతో అలంకరణలు అక్క తమ్ముళ్ల అనురాగాలు అన్నాచెల్లెళ్ల మమకారాలు అతిథులతో నెలకొన్న ఆప్యాయతలు నవధాన్యాల గొబ్బెమ్మలతో ఇంటినిండా కాంతులు మామిడాకుల తోరణాలు కలగూరలతో పలహారాలు గారెలతో రుచులు పాయసాలతో ఘుమఘుమలు సంతోషంతో పిల్లల కేరింతలు వారెవ్వా అనిపించు తీపిరుచులు భోగి మంటలతో మానసిక చైతన్యం బొమ్మల కొలువుతో చక్కటి ఆహ్లాదం నింగిన గర్వంగా మురిసే గాలిపటాలు బాలబాలికలలో పెంచెను ఆత్మవిశ్వాసం ఊహాశక్తి,సృజనాత్మకతని పెంచే పండగ తెలుగువారి క్రాంతిని పంచే పండుగ తెలుగు సంస్కృతిని చాటే పండుగ అనురాగాన్ని, ఆత్మీయతని పంచే పండుగ! అదే సంక్రాంతి ... అదే అదే సంక్రాంతి పండుగ !!
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై