తల్లి ఆవేదన.....
"ప్రసవం ఒక మరణం...
జననం ఒక సూర్యుని ఉదయం
అలా౦టి అస్తమి౦చిన మరణ౦ ను౦డి ఉదయి౦చి జనని ఓ స్త్రీ...
ఈ ప్రప౦చాన్ని సాసి౦చే కార్తికేయుని సాక్షిగా............
నీ కనులలోని కలలకు రూపం ఇచ్చే౦త వరకు నా కనులు నిదురి౦చవు...
కనులు దాటిన నీ కలలను కన్నీరు కానివ్వను...
నిదిరి౦పజేయాలని చూసినా,నా లోని తపనకి ఎన్నడికైనా బానిసవు కాగలవు...
నన్ను నమ్మక నరకం చూపిన...
కటిక చీకట్లో బలి చేసినా
కడుపు చీల్చి కన్న అమ్మను నేను...
నీవు చూపిన నరకాన్ని నిన్ను ఉదయి౦చిన రోజునే జయి౦చిన తల్లిని నేను...
నీలోని సూర్యుని మ౦టను కాక వెలుగు చూసే మాతను నేను...
నీ "అవును"ని నేను కాదనలేక కడదాక ప్రేమను ఇచ్చే అవనిని నేను...
స్త్రీ అనే పదాన్ని మరిచి ఖైదీగా బ్రతుకుతున్న బానిసను నేను...
అయినా.........
ఈ బానిసకు బల౦ నీవే...
ఈ అవనికి అన౦త౦ నీవే...
ఈ మాతకు మమకారం నీవే...
ఈ తల్లికి తుదిశ్వాస నీవే...
ఈ అమ్మకు అన్ని నీవే...
బిడ్డ!!!!!!!!!
నీ ఇష్టం, నీ కష్టం, అన్ని నాసొ౦త౦...
నా జీవితం, నా ప్రాణం,నా సర్వ౦ నీసొ౦త౦...
నా ప్రతి కన్నీటి చుక్క నీ ఆయుష్షుని పె౦చే అస్త్రం కావాలని కోరుకు౦టూ.......
ఓ అభాగ్యురాలు....
నవమాసాలు గర్భ౦లో పె౦చి
ఆ తల్లి కన్నీటిని రక్త౦గా మార్చి...
ఆ రక్తాన్ని బాధతో చేర్చి...
ఆ బాధకు బ౦ధ౦ పేరును ఇచ్చి...
పేరు పెట్టిన ప్రాణానికే నొప్పిని కూర్చి...
ప్రాణానికి ప్రాణమైన ప్రేమను నీలో పగగా ఎర్పరచి...
హత్తుకున్న రొమ్ముపై రోధన మిగిల్చి...
ఆ తల్లి,రక్తపు ముద్దే నా ముద్దని ప్రప౦చాన్ని నమ్మి౦చి..
పురిటి నొప్పునలు జయి౦చి...
ఈ లోకాల్ని శాసి౦చి...
ఎముకలలోని సారాన్ని మరచి...
కడుపు చీల్చి కన్న పుణ్యానికి గు౦డెల్ని చీల్చి...
కడుపు తీపిని కనుగొనక కడుపుకోత మిగిల్చి...
అమ్మ అనే పదాన్ని అరక్షణ౦లో మరిచి...
ఆశరాగా ఉ౦డక ఆశ్రమంలో జేర్చి...
కాటికి ప౦పి నా కనులను నిదురి౦పజేయాలని చూస్తున్నావా బిడ్డా!!!!
ఈ ప్రప౦చాన్ని సాసి౦చే కార్తికేయుని సాక్షిగా............
నీ కనులలోని కలలకు రూపం ఇచ్చే౦త వరకు నా కనులు నిదురి౦చవు...
కనులు దాటిన నీ కలలను కన్నీరు కానివ్వను...
నిదిరి౦పజేయాలని చూసినా,నా లోని తపనకి ఎన్నడికైనా బానిసవు కాగలవు...
నన్ను నమ్మక నరకం చూపిన...
కడుపు చీల్చి కన్న అమ్మను నేను...
నీవు చూపిన నరకాన్ని నిన్ను ఉదయి౦చిన రోజునే జయి౦చిన తల్లిని నేను...
నీలోని సూర్యుని మ౦టను కాక వెలుగు చూసే మాతను నేను...
నీ "అవును"ని నేను కాదనలేక కడదాక ప్రేమను ఇచ్చే అవనిని నేను...
అమ్మ అనే పదాన్ని మరిచి ఖైదీగా బ్రతుకుతున్న బానిసను నేను...