మురిపెముగా ఎగురుతోంది. మువ్వన్నెల పతాకం ముదముతో నిండుతోంది ప్రతి(భారత) పౌరుని హృదయం శాంతిని ప్రభోదించే కపోతాల ధవళ వర్ణమీ పతాకం ఆకుపచ్చతో సస్యశ్యామలాన్ని కాంక్షించినదీ పతాకం పోరాటాల చరిత్ర తెలిపే ఎరుపు తో మెరిసినదీ పతాకం అశోక ధర్మ చక్రంతో ఆదర్శమైనదీ పతాకం. లాల్ బాల్ పాల్ ల పోరాట ఫలితమీ పతాకం గాంధీజీ నెహ్రుజీ నేతాజీల కష్ట ఫలితమీ పతాకం బ్రహ్మన్న, భగత్, రాజేంద్రల త్యాగమీ పతాకం అల్లూరి, ఆజాద్ ల ఆగ్రహ ఫలితమీ పతాకం పటేల్, కలాం, సరోజినీల దౌత్య ఫలితమీ పతాకం అమృత భాండం భరత ఖండమని తెలిపినదీ పతాకం భాషలెన్ని ఉన్న జాతీయ గీతమొక్కటని మురిసినదీ పతాకం మతాలెన్ని ఉన్న మానవత్వమొకటే మతమన్నదీ పతాకం కులాలెన్ని ఉన్న కుటిలత్వం లేనిదే కులమన్నదీ పతాకం పార్టీ లెన్నీ లెన్ని ఉన్న పరోపకారమే పరమావధిన్నదీ పతాకం వర్ణవర్గ విభేదాల కతీతమైనదే ఐకమత్యమన్నది పతాకం ఆత్మీయ పతాకం జాతి ప్రాంత భేదం లేక ఏక ఏకమైనదీ ఆత్మీయ ఆత్మగౌరవం ఆకాశమంత ఎత్తు నుండాలన్నదీ పతాకం తరతరాల భవితకి భద్రతీ భారత పతాకం సంస్కృతీ సంప్రదాయాల కాలవాలమీ పతాకం విశ్వమంతా ఘనకీర్తి తో వినతి కెక్కినదీ పతాకం కలాలెన్ని ఉన్నా గళమొక్కటై ఎగసినదీ పతాకం కల్లోలాలెన్నున్నా కలిసికట్టుగా ఎగరేసినదీ పతాకం నవయుగానికి నాంది వాక్యమైనదీ పతాకం నవశకానికి మార్గదర్శకమైనదీ పతాకం భావితరానికి బాట చూపించే దిక్సూచీ పతాకం భారత ఆచారవ్యవహారాలకు ఆలవాలమీ పతాకం అమరవీరుల త్యాగాలకు జ్ఞాపకమీ పతాకం భావిభారత పౌరుల భవిత నిర్మించేదీ పతాకం వందేమాతరమని నినదించినదీ పతాకం జనగణమణ యని అందరినీ దరికి చేర్చినదీ పతాకం మత్తును పారద్రోలి మేల్కొలపాలీ నవయుగ పతాకం మంచిని పెంచి నవతరాన్ని నడిపించాలి నవశక పతాకడా మంచి మార్పు తో యువతరాన్ని మురిపించాలీ పతాకం నీతిపద్యాలతో యువత గతిని మార్చి మైమరపించాలీ పం భరతబిడ్డల పౌరుషాన్ని రగిలించాలీ పతాకం అజ్ఞాన తిమిరాల తరిమి విజ్ఞాన జ్యోతులు వెలిగించాలీ పదా దేశప్రగతికి బాసటై బంగారు కాసులు కురిపించాలీ పతాకం ఎందఱో మహానుభావుల ప్రాణ త్యాగమీ పతాకం మరెందరో మాననీయుల ప్రతీక ఈ పతాకం ఇంకెందరో మహనీయుల బలిదానమీ పతాకం మరిపించాలి మురిపించాలీ మైమరిపించాలీ... (కోరస్) రగిలించాలి, వెలిగించాలి, కురిపించాలీ... రగిలించాలీ వెలిగించాలీ కురిపించాలీ
తల్లి ఆవేదన….. “ప్రసవం ఒక మరణం… జననం ఒక సూర్యుని ఉదయం అలా౦టి