జెండా పండుగ వస్తుందంటే చాలు అంతులేని అంతులేని ఆనందం, ఉత్సాహం ఒకరోజు ముందే జెండా రంగుల బట్టలు కుట్టించుకోవడం తరగతి గదిని రంగు కాగితాలతో చక్కగా అలంకరించడం అందమైన ముగ్గులు పెట్టడంఆటలు, పాటల పోటీల్లో పాల్గొనడం ఆరోజు ఉదయాన్నే బడికి వెళ్ళడం గురువులకు భక్తితో నమస్కరించడం జెండాలు పట్టుకుని వీధి వీధి తిరగడం అన్ని కార్యాలయాల్లో జాతీయ గీతం పాడడం చదులమ్మను.. దేశ నాయకులను పూజించడం బడిలో జెండా ఎగిరేయగానే భక్తితో సెల్యూట్ చేసి జనగణమన గీతాన్ని పాడడం ముందురోజు జరిగిన పోటీల్లో గెలిచిన వారికి వచ్చిన బహుమతులను, బడిలో ఇచ్చిన చాక్లెట్లు, స్వీట్లు తెచ్చి గర్వంగా ఇంటికి వచ్చి అమ్మ చేతిలో పెట్టడం అమ్మ కళ్ళల్లో సంతోషం,.. ఇచ్చిన తీయని ముద్దు అదో అందమైన అనుభూతి, ఆరోజులు ఇప్పుడు అందమైన జ్ఞాపకాలు.
తల్లి ఆవేదన….. “ప్రసవం ఒక మరణం… జననం ఒక సూర్యుని ఉదయం అలా౦టి