పల్లవి
ఎవరు రా చెపుతారు ప్రసవ వేదన
తనను తాను చీల్చుకునే తల్లి రోదన
ప్రాణ బిక్ష పెట్టేందుకే నిత్య సాధన
అనుక్షణం తపియించే పేగు దీవెన
అమ్మంటే తలపు రా
అమ్మంటే గెలుపురా
అమ్మంటే జన్మ రా
మానవాళి బ్రహ్మరా
ఎవరురా చెపుతారు ప్రసవ వేదన
తనను తాను చీల్చుకునే తల్లి రోదన ...
చరణం
ఒడిలోన పెట్టుకుని పాల ధార నిస్తుంది
బడిలోన నిను చేర్చి చదువు విలువ చెపుతుంది
బతుకంతా నీ కోసం మొక్కులు చెల్లిస్తుంది
మొక్కనుండి మాను చేసి మౌనంగా చూస్తుంది
అమ్మంటే కథకాదు
నడిచొచ్చే కావ్యంరా
అమ్మంటే మెతుకు కాదు
వరమిచ్చిన బతుకురా
చరణం
ఆటలన్నీ ఆడిస్తూ గెలుపు విలువ చెపుతుంది
బంధువుల్ని చూపిస్తో బలగాన్ని పెంచుతుంది
మిత్రులతో నిన్ను చేర్చి భరోసాని ఇస్తుంది
మూడు ముళ్ల బంధంతో మమతని జత చేస్తుంది
అమ్మంటే అమ్మె రా
అమ్మ కెవరు సాటిరా
కదిలొచ్చే బ్రహ్మగా
పుట్టేది అమ్మేగా ....
ఎవరురా చెపుతారు ప్రసవ వేదన
తనను తాను చీల్చుకునే తల్లి రోదన ...


4 comments
Super Congratulations Madam 💐💐❤️
అద్భుతః
చాలా బాగుందమ్మా పాట 👏👏
మీకు సమూహ మిత్రులందరికీ మాతృ ఫినోత్సవ శుభాకాంక్షలు 🌹🌹🌹
మాతృ మూర్తి values అద్దం లో చూపినట్టు స్వచ్ఛంగా ఉంది.
అక్షరయాన్ మాతృ మూర్తులందరికీ మాతృ దినోత్సవం శుభాకాంక్షలు