*స్వీయ పరిచయం*
పేరు:జోషి పద్మావతి
పుట్టిన తేదీ:/వయస్సు1967 నవంబర్ 22
జన్మ స్థలం: అలంపూర్
విద్యార్హతలు : M. A. T.P.T
తల్లిదండ్రులు: తండ్రి:స్వర్గీయ దిండిగల్లు భీమసేనాచార్యులు
తల్లి :(గంగా భాగీరథీ సమానురాలు) గం. భా. దిండిగల్లు భానుమతి
భర్త : జోషి అనంతరావ్(అశోక్)
వృత్తి:అర్చకత్వం, పౌరోహితం
సంతానం: ఇద్దరమ్మాయిలు
నివాసం: మహబూబ్ నగర్ రచనలు :కవితలు,గేయాలు, గజళ్ళు,రుబాయూలు, సమీక్షలు, ఆటవెలదిపద్యాలు సాహితీ సమూహాలలో దాదాపుగా (అన్నీ కలసి) 500పైగా వ్రాశాను.ఏవీ పుస్తకరూపంలోకి తేలేదు.
కారణం: *మా ఇలవేల్పైన శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభస్వామిపై ఏదైనా ఒక రచనచేసి, పుస్తకరూపం తెచ్చాకే మిగతా రచనలకు పుస్తకరూపమివ్వాలనేది ఆకాంక్ష*
8) సాహిత్య సేవ : పలు సాహితీ కార్యక్రమాలలో పాల్గొంటూ వుంటాను.
9) వృత్తి: (ప్రైవేట్) తెలుగు ఉపాధ్యాయిని
ప్రవృత్తి : సాహిత్యసేవ
సాధించిన విజయాలు : శ్రీ మల్లినాథసూరి కళాపీఠం అనే సమూహ వ్యవస్థాపకులు శ్రీ అమరకుల దృశ్యకవిచక్రవర్తుల ప్రోత్సాహంతో కవితలు, చిరు కవితలు, గజళ్ళు, సమీక్షలువంటి అనేక ప్రక్రియలలో క్రమంతప్పకుండా రచనలు చేస్తూ, వారిచే *కవిచక్ర* *కవిశిఖర* బిరుదులనుపొందాను.
యాభై పైచిలుకు ప్రశంసాపత్రాలను పొందాను.
*తెలుగు వెలుగు సాహిత్యసేవ* సమూహాన గత మూడు సంవత్సరాలుగా రచనలు చేస్తూ, వారు నిర్వహించే అంతర్జాల సమావేశములందు (దాదాపుగా100సమావేశాలు) పాల్గొని 50పైచిలుకు ప్రశంసాపత్రాలను పొందాను. వారు నిర్వహించిన కవితా పోటీలలో రెండింటిలో ద్వితీయ, తృతీయ బహుమతులు పొందాను.
కవనజ్యోతి వ్యవస్థాపకులు నిర్వహించిన కవితాగానం సీజన్2 సమూహంలో పౌర్ణమి కవితా పోటీలలో తరచుగా పాల్గొంటూ మూడు సార్లు నగదు బహుమతులను పొందాను
మహబూబ్ నగర్ లోని తెలంగాణా మహిళా సాహితీ సంస్థవారు నిర్వహించే పలు సాహితీ కార్యక్రమాలలో పాల్గొంటూ, ప్రశంసాపత్రాలను, జ్ఞాపికతోకూడిన సత్కారాలను పొందాను. నేను ప్రస్తుతం పనిచేసే లుంబినీ హైస్కూల్ డైరెక్టర్. మాన్యులు లక్ష్మణ్ గౌడ్ గారు నిర్వహించే పలు సాహితీ కార్యక్రమాలలో వ్యాఖ్యానం, వందనసమర్పణంవంటి సేవలు చేశాను. మా స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు పద్యపఠనము,భగవద్గీత శ్లోకాల కంఠస్థం, కవితాపఠనం, ఉపన్యాసం, వ్యాసరచన వంటి వాటికి సహకారం అందించి ఎన్నో బహుమతులు పొందేలా సహకారం అందించాను.
ముద్రించిన పుస్తకాలు : కొన్ని సంకలనాలలో, మాస, దిన పత్రికలలో నా కవితలు ప్రచురితమయ్యాయి.
అవి :వంశీ ప్రచురణలవారి 250 మంది కవయిత్రులకవితా సంకలనం- *కవితామేఘమాల* లో *షడ్రసోపేత సాహితీ సంగమం* అనుకవిత,
అక్షరయాన్ వారి *పసిమొలకలు-రుధిరజ్వాలలు* కవితాసంపుటిలో *జాగృతంచేద్దాం* అనుకవిత,
జె. డి. ప్రచురణల *లేఖావలోకనం* లో ఒక లేఖ మరియు *అవలోకనం* పేరుతో 126 గురు రచయిత్రుల *కరోనా డైరీ* లో ఒక రెండుపేజీల డైరీ,
తెలంగాణా *కవయిత్రుల కవితా సంకలనం* *తెలంగాణ మహిళ* లో *మహిమాన్విత చరిత-వనిత* అను కవితను,
పాలమూరు సాహితీ సరోవరం గా కీర్తించబడిన కీ. శే. జలజం సత్యనారాయణ గారి స్మృతికవితల సంకలనం *మన జలజం* లో *అక్షరనివాళి* శీర్షికన ఒక కవితను, వారి జ్ఞాపక చిహ్నంగా వెలువడిన ప్రత్యేక సంచిక *పాలపిట్ట* లో ఒక కవిత ప్రచురితమయ్యాయి. ఇంకా, రైతులకు సంబంధించిన కవితా సంకలనం,
సంక్రాంతి కి సంబంధించిన కవితా సంకలనం,
మహిళారక్షకభటులకు సంబంధించిన కవితా సంకలనంలో నా కవితలు ప్రచురితమయ్యాయి.
అక్షరాంజలి మాసపత్రిక, అష్టాక్షరి సాహిత్య మాసపత్రికలలో నా కవితలు ప్రచురితమౌతూ వుంటాయి.
అవార్డులు రివార్డులు:75వసంతాల స్వాతంత్ర్య దినోత్సవం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రెండువేల రూపాయల నగదు, జ్ఞాపిక,ప్రశంసాపత్రంతో సత్కారము, మహిళాదినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా పురస్కారం, కవిచక్ర, కవిశిఖర, బిరుదులతో ప్రశంసాపత్రాలుపొందాను.
అష్టాదశ శక్తిపీఠాలలో 5వ దైనఅలంపురం దేవస్థానాలలోని యోగ నరసింహస్వామి ఆలయ అర్చకులైన కీ. శే. భీమసేనా చార్యులు, శ్రీమతి భానుమతి లకు నేను మొదటి బిడ్డను.
నేనుమల్లినాథసూరి కళాపీఠం అనే సమూహంలో 3 సంవత్సరాలు రచనలు చేశాను.తెలుగు వెలుగు సాహితీ వేదికలో కూడా 3సంవత్సరాలుగా కొనసాగుతున్నాను. కవితాగానం సీజన్2&సీజన్ 3లోనూ పౌర్ణమి కవితా పోటీలలో పాల్గొంటూన్నాను.
అక్షరయాన్, శ్రీ శ్రీ కళావేదిక, వాగ్దేవి సాహితీ వేదిక, వంటి సాహితీ సమూహాలలో రచనలు చేస్తుంటాను.అదేవిధంగా విఠల్ గారి ప్రోత్సాహంతో 200దాకా పంచపదులు వ్రాయగలిగాను.
పంచాక్షరీ పంచపదులు కూడా ఒక 10 సంఖ్యలో వ్రాయగలిగాను.
__________