నిజంగా పట్నంలో సం, గానే సంక్రాంతి అది పల్లెదారి పట్టింది ఉన్నకాస్త సెలవులు హ్యాపీ గా ఉన్నతంగా గడిపాలన్న సంతృప్తి కోసం ఎప్పుడెప్పుడా అని పట్నం దాదాపు సగం అయ్యింది ఎంత కష్టమైన సాలుకోసారి తమ వారికై తమ ఊర్లకు పరుగు పెట్టించింది రకరకాల పంటలకు లోగిళ్లు ప్రేమ ఆప్యాయతలకు పొదరిండ్లు మామతానురాగల మగాణులు పట్నవాసంలో లేదీ ఆచూకీ భోగి మంటల్లో ఆహాన్ని వదిలి కుటుంబ ప్రేమ వెచ్చదనం పంచుకొని కళ్ళా పి చల్లిన ముంగిళ్ళు పచ్చతోరణాల స్వాగతాలతో పల్లెతల్లి రారమ్మని తన ఒళ్ళోకి పిలుస్తుంది సంప్రదాయ పరికిణి ల్లో తెలుగు గాజుల గలగలల్లో మంజీరాల సవ్వడిలో ముంగురుల సవరింపులతో ఆడపడుచుల అందమై దృశ్యమాలిక అల్లుతుంది బసవన్నల రాక కోడిపందెలు గాలిపటాల జోరు దానికి తోడు మ్యూజిక్ హోరు లో నిమగ్నమైన యువత పిండి వంటలు నువ్వులడ్డూ లతో వర్ణ శోభితమే వడ్డించిన విస్తరి పంటల్లో ముఖ్య భూమిక పశువులు వాటి గుర్తింపుకై అలంకరించి పూజించుట కనుమ వేడుక కనువిందు సాంప్రదాయం తమ వారికోసం తమ పల్లెకు రప్పిస్తున్న సంక్రాంతి పండుగ పల్లెదారి పట్టిందనటంలో సందేహమే లేదు.
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై