సుదినం పర్వదినం స్వతంత్ర భారత గగనం దివాకర రజనీకర ఆగమనం జాతీయ పర్వదినాలని గణనం ఎగిరే త్రివర్ణ "కేతనం రాజ్యాంగ రూపకల్పనం సహకార సంక్షేమ పథకం ప్రజలక్షేమం ప్రభుత్వానికి సాధకం ఆంగ్లేయులు భారతావనిపై లోహపాదం మోపినదినం భారతి కచ్ఛపి వీణాతంత్రుల తెంచిన పాపిష్టి పెత్తనం స్వాతంత్య్ర సమర యోధుల కృషిఫలితం తోక ముడిచి వెన్నుజూపిన పలాయనం అస్తవ్యస్త పరిస్థితుల చక్కబరిచి అంబేద్కర్ మహాశయుడు ప్రజాస్వామ్య విధాన రాజ్యాంగం అమలుపరిచిన దినం అదే గణతంత్ర దినం సుదినం పర్వదినం
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై