సం' అంటే మిక్కిలి, 'క్రాంతి' అంటే అభ్యుదయం.మంచి అభ్యుదయం కలిగించే విశిష్ట పర్వదినం సంక్రాంతి. భానుడి మకరరాశి ప్రవేశం, ఉత్తరాయణ పుణ్య కాలం ఆరంభం. ముందు భోగి, తరువాత కనుమలతో రాజసంగా సంక్రాంతి ఆగమనం. 1 కష్టపడి రైతన్నలు పండించిన పంట ఇళ్ళకు చేరే సమయం. అందమైన రంగవల్లులతో పలుకుతారు ధాన్యలక్ష్మికి స్వాగతం. ధనాన్ని కురిపించే ధాన్రపురాశులతో నిండిన గృహాలకు పచ్చని బంతిపూల తోరణాలతో ధనలక్ష్మికి ఆహ్వానం. పాడిపంటలు నిచ్చే పశుసంపదను కనుమనాడు పూజాదికాలతో కృతజ్ఞతాభివందనాలు. / రంగురంగుల రంగవల్లులు, అందమైన గొబ్బెమ్మలతో సంక్రాంతికి నీరాజనాలు. మొగలి పువ్వంటి మొగుడిని ఇమ్మంటూ కన్నెపిల్లల గొబ్బి పాటల సందడులు. పిల్లాపాపలకు భోగిపళ్ళతో దిష్టితీతలు, పెద్దలఆశీస్సులు, దీవెనలు. పసుపుకుంకుమలు, పూలు, గాజులతో ముత్తైదువులకు వాయనాలిస్తూ, సుమంగళిత్వానికి సౌభాగ్య లక్ష్మికి వేడుకోళ్ళు. పితృదేవతల పూజలతో స్వర్గీయులకు తృప్తి ప్రధానాలు. దానధర్మాలతో దారిద్ర్యానికి వీడ్కోలు చెప్తూ, పుణ్య సంప్రాప్తికై నోములు వ్రతాలు. ప్రాంతీయ ఆచారానుసరంగా, చక్కిలాలు, అరిసెలు, నువ్వుల వంటలతో పసందైన విందులు, కోడిపందాల వినోదాలు. ఆకాశంలో పతంగుల విహారాలు, కుర్రకారు ఆనందోత్సాహాలు. క్రొత్త అల్లుళ్ళకు అత్తింటివారి ఘనమైన మర్యాదలు, ప్రేమపూర్వక కానుకలు. ఒకటా రెండా, అన్నిరకాల సందడులతో సంక్రాంతి పర్వదినం... పల్లీయులకే కాదు పట్టణ వాసులకూ ప్రియమైన శుభకరం. ఆటపాటలతో, సరదాసందడులతో సర్వులకూ ఆనందదాయకం. ఈ 'సంక్రాంతి సంరంభం' కవిత నా స్వీయ రచన
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై