సూర్యుడి మకర సంక్రమణ ఆగమనంతో
సంక్రాంతి శోభల శుభారంభంతో
అంబరాన పతంగుల విహారంతో
అవనిపై కోళ్ల పందేల సమారంభంతో
ముంగిళ్లలో తీరొక్క రంగుల హారాలతో
గుమ్మాలకు మామిళ్ల తోరణాల శోభాయమానంతో
హరిదాసుల మధుర సంకీర్తనల ఆలాపనతో
డూడూ బసవన్నల సుందర నాట్యాలతో
పచ్చని పల్లె సీమల సోయగాలతో
కొత్త అల్లుళ్ళ సరదా సరదా వినోదాలతో
హేమంతపు హిమాల ఘనీభవంతో
సమస్త తిమిరాలను హరించే భోగి మండలతో
నోరూరించే సమస్త వంటకాల ఘుమఘుమలతో
ముద్దబంతుల గొబ్బిళ్ళ మురిపాలతో
పాడిపంటల పరవళ్ల పరవశాలతో
అంబరాన్నంటే నవ్యకాంతులతో
హితవు,సన్నిహితుల చతురోక్తులతో
గుర్తుండి పోవును ప్రతీజ్ఞాపకం
నెమరు వేసుకోవాలి మరో సంక్రాంతి వరకై
సుఖశాంతుల సంక్రాంతి
అదే సొమబరాల సంక్రాంతి??
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై