పల్లె పల్లెలో వెలుగు ధాన్యపు రాశుల సిరులు గాదెలు నిండిన హంగులు వచ్చెనే పెద్ద పండుగ సంక్రాంతి ఓ సంబరమై!. పచ్చ పూల పరికిణీలు ఎర్రమందారాల ఓణీలు బుట్టచేతుల జాకెట్టులు పెదాలపై గులాబీలు ముద్దబంతుల కలలు ఓ వైపు భోగిమంటల చిటపటలు డూ డూ బసవన్నల గంటల గలగలలు మాలక్ష్మి గజ్జెలపట్టీల రవళులు మరోవైపు ఇంటిముంగిట రంగవల్లులు హరిలో రంగ హరీ ' అంటూ హరిదాసుల కీర్తనలు అమ్మ మెడలో ముత్యాల హారాల ధగధగలు తెచ్చెనే పెద్ద పండుగ సంబరమై! రోళ్లు రోకళ్ళు అరిసెల పిండి టాల్కమ్ పౌడరుతో కన్నె పిల్లల పిల్లకుప్పెల జడలతో చెమ్మచెక్కల సయ్యాటలతో ఓరచూపులతో బావలను కవ్వించే మరదళ్ళతో వచ్చెనే వచ్చెనే పెద్ద పడగ సంబరమై మన సంక్రాంతి పండుగ!!
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై