భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై నుండి. అల్విదా అనను, సరిహద్దు అడుగడుగున కనిపించని గస్తీనై సంచరిస్తా. సెలవని చచ్చినా చెప్పను.. అమరజీవినై జన్మభూమికి కంచెనై కంటిపాపలా కాచుకుంటా... సెల్యూట్ అన్నారో, శవాన్నైనా... శత్రువు గుండెను చీల్చి శౌర్యాన్నై నిలుస్తాను. నాకోసం కారే కనీ కన్నీటి చుక్కల్లోంచీ, ఫిరంగి వదిలిన పేలుడునవుతా.. ప్రతి పౌరుడిలో దేశభక్తి బీజమవుతా...మళ్ళీ ఆగిన సైనికుడి శ్వాసతో, మువ్వన్నెల పతాక ఊపిరినై.. కోట్లగుండెల దేశపటమవుతా. రాతిరి నక్షత్రాన్నై, కాపలా కాస్తా, పగలు వెలుగునై, కవాతు చేస్తా, గస్తీ గడపలో గర్వాన్నై నిలుస్తా. ప్రాణత్యాగ తోరణంతో కర్మభూమి సిగలో శిఖరాన్నవుతా, మళ్ళీ సైనికుడినై జన్మిస్తా.
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై