నాదేశం నాలుగు వేదాలు పుట్టిన 'పవిత్ర' 'దేశం' భరతమాత బిడ్డగా నా జన్మ పునీతం' నాదేశ ఔన్నత్యం 'హిమవన్నగమే'! అమరవీరుల సమరయోధుల 'మాతృమూర్తి' అజరామరం స్మరణీయం వారి 'దేశభక్తి'' జీవనదులే తనకి వజ్ర ‘వడ్డాణం' ప్రకృతే తనకు పచ్చని ‘పట్టుచీర’ ఎత్తైన శిఖరాలు అమృత 'కలశాలు' పసిడి పంటలే కంఠంలో 'హరితహారం'. వాదనలు లేని 'వేదభూమి' నాదేశం భిన్నత్వంలో ఏకత్వమైన ఛాత్రమ నీతి నిజాయితీల 'నిండుజాబిలి'. శాంతి సౌభాగ్యాల సౌందర్య 'సాగరం' ఆరావళీ నీలగిరులు గులాబీల్లా 'సొబగులు' అవనికి వన్నె తెచ్చే ఆనంద 'నందన' 'వనం' సౌందర్య శిల్పకళలలో కనుదోయికి 'కాణాచి' తెల్లదొరలను తరిమికొట్టిన 'పౌరుషగడ్డ' దృఢమైన త్రివిధ దళాలతో నిత్యం 'పహారా' కళకళల త్రివర్ణ పతాక 'రెపరెపలు' చదువు సంస్కారాల 'కలువల' 'కొలను' నిత్యం నాదేశం 'సుభిక్షం' 'శోభాయమానం' 'మేరా' 'భారత్' 'మహాన్' ! 'జయహో' !!
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై