EVENT DISCRIPTION
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 5వ తేదీన రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ థియేటర్లో భాషా సాంస్కృతిక శాఖ, అక్షరయాన్, సీతాస్ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన మహిళా సంబురాలు, పుస్తకావిష్కరణ
మహిళా రచయితల్లో సంఘటిత శక్తిని ఏకం చేస్తూ ముందుకు సాగుతున్న అక్షరయాన్ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి గారు ఆకాంక్షించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మంగళవారం రోజు రవీంద్ర భారతిలో “స్వర్ణ ద్వీపం” | పుస్తకావి ష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సివిల్స్ లో టాపర్గా నిలిచిన ఒరియా ఐఎఎస్ అధికారి (విశ్రాంతి)హృ షికేశ్ పాండా ఒరియా లో రాసిన నవలను ఇంగ్లీషు లోకి లిపి పుష్పా నాయక్ గారు అను వదించగా తెలుగులోకి స్వాతి శ్రీపాద గారు అనువదించడం అభినందనీయం అన్నారు.
పుస్తకాలు చదివే అలవా టును అందరూ అలవర్చు కోవాలని ఆయన సూచించారు సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ ల గురించి పుస్తకాలే ముందు తరాలకు అందిస్తాయని ఈ సందర్భంగా పార్థసారథి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఒరియా రచయిత హృషికేశ్ పాండా మాజీ ఐఏఎస్, రచయితలు లిపి పుష్ప నాయక్ స్వాతి శ్రీపాద, పాలపిట్ట పబ్లికేషన్స్ గుడిపాటి వెంకటేశ్వర్లు, అక్షరయాన్ వ్యవస్థాపకురాలు అయినంపూడి శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
మహిళా రచయితల కవి సమ్మేళనం అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫౌండేషన్ మరియు సీతా చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి నిర్వహణ లో మహిళా సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ భాషల కవితలను మహిళా రచయిత్రులు చదివారు. దాదాపు 50 మంది మహిళా రచయితలు కవి సమ్మేళనం లో పాల్గొన్నారు.
తెలుగు మలయాళం కన్నడ ఉర్దూ హిందీ ఇంగ్లీష్ తదితర భాషల్లో మహిళ కవులు తమ కవితలను వినిపించారు. ఈ కవి సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ మహిళామణులు, హైమావతి భీమన్న, ఆలూరి విజయలక్ష్మి, బండా సరోజన, శ్రీమతి లక్కరాజు నిర్మల, శ్రీమతి రాణి నల్లమోతు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగరాజు రంగారావు రచించి, రాయారావు విశ్వేశ్వర్ రావు స్వరకల్పన చేసిన ‘భారతీయ వనిత’ ఆడియో ఆవిష్కరణ వైభవంగా జరిగింది.
ఈపాటకు సంగీతం సత్యదీప్ శర్మ సమకూ ర్చగా అమరవాది శ్రీవాత్సవ గానం చేశారు. ఆసాంతం మహిళ గొప్పతనాన్ని చాటిన ఈ పాట విని పాల్గొన్న మహిళలంతా సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రచయితలతో పాటు ఉర్దూ, కన్నడ, హిందీ, మరాఠీ భాషల మహిళా రచయితలు కూడా పాల్గొనడం అభినందనీయం.
Sri C. Parthasaradhi
IAS (Re), State Election Commissioner
Ande Sri
Poet and Lyricist
Jonnalagadda Snehaja
Regional Passport Officer of Hyderabad
Inampudi Shreelaxmi
Aksharayan Founder,Writer
Sri Baisa Devadas
Editor of Neti Nijam
Shri Vamsi Ramaraju
Vegesna Foundation Founder
Dr Sarojana Banda
Writer
Dr. Sammeta Vijaya
Teacher, Writer, Theatre Researcher
Aksharayan Award Winners
Dr. Thallapalli Yakamma
V. Prathima
V. Prathima
V. Prathima
V. Prathima
Muktevi Bharathi
Annangi Venkata Seshalakshmi
Kuppambika Award
Devanapalli Veena Vani
Kuppambika Award
Chukkayapalli Sridevi
Dr. Aluri Vijayalakshmi
Rangajamma Award
Dr Vasundhara Reddy
Aksharayan Yuva Rachayithri Award
Sri Chandana Rachuri
Aksharayan Yuva Rachayithri Award
Renuka Eedholla
Vishnavi Thadapakal
Aksharayan Balika Award
Anjana Sathwika
Aksharayan Balika Award
B Sai Naveena
Laxmi Ganesh Narsimhulapally
Revanth Goud
EVENT VIDEO
RECENT PUBLICATIONS
అక్షరయాన్ – తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్