EVENT SUMMARY
జయహో అక్షరయాన్…
అక్షరయాన్ రచయిత్రులకు ఈ రోజు ఒక సుదినం. సత్వ నాలెడ్జ్ సెంటర్ లో జరుగుతున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ లో మీట్ మై బుక్ లో భాగంగా వీ హబ్ ఆధ్వర్యంలో ఉద్యమిక అనే పుస్తకం ఆవిష్కరింపబడింది. 50 మంది మహిళ వ్యాపారవేత్తల గురించి 50 మంది అక్షర యాన్ మహిళా రచయిత్రులు చేసిన రచనల సంకలనమే ఉద్యమిక.
మహిళలు వివిధ రంగాలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి
తమ శక్తి సామర్ధ్యాలను నిరూపించుకుంటున్నారు .తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక సంస్థను స్థాపించి చాలామందికి ఉద్యోగ అవకాశాలను కల్పించి వారికి అండగా నిలుస్తున్నారు. అటువంటి మహిళలను గురించి అక్షరయాన్ రచయిత్రులు ఒక్కొక్కరిని ప్రత్యేకంగా కలిసి వారితో ఇంటర్వ్యూ తీసుకుని వారి విజయం వెనక ఉన్నటువంటి విషయం అడిగి తెలుసుకుని పరిచయం చేసినటువంటి వ్యాసాలను ఈ ఉద్యమికలో ప్రచురించారు.
ఇది ఖచ్చితంగా ఒక స్ఫూర్తిదాయకమైన పుస్తకం . నేనేం చెయ్యాలా అని ఆలోచించే వారికి ఏమీ చేయలేకపోతున్నామని నిరాశ చెందే వారికి ఏదైనా చేసి చూపించగలం అని నిరూపించడానికి ఈ పుస్తకం ఒక చక్కటి మార్గదర్శి అవుతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు మీరందరూ ఈ పుస్తకాన్ని ఆన్లైన్లో కొనుక్కొని చదువుతారని ఆశిస్తున్నాము. పుస్తకంలో మా వ్యాసాలు రావడానికి ప్రధానమైన వ్యక్తి శ్రీమతి అయినంపూడి శ్రీ లక్ష్మీ గారు జ్ఞానేశ్వర్ గారు దీప్తి గారు మరియు వీ హబ్ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
EVENT GALLERY
EVENT VIDEO
UDYAMIKA BOOK
RECENT PUBLICATIONS
అక్షరయాన్ – తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్
Post Views: 1,027