స్వేచ్చా రెక్కలు విప్పుకుని-వినీలాకాశం లో వింత శోభతో ఎగిరే విహంగమా! ధ్రువ తారలా కీర్తి వెలుగులు- విరజిమ్ముతున్న కాంతిపుంజమా! తెగించి పోరాడి గెలిచిన తెలుగు వీరుల తేజమా! ఆంగ్లేయుల తుపాకుల కాల్పులకి ప్రవహించిన రుధిర రక్తమా! భరతమాత ప్రియపుత్రుడు- పింగళి వెంకన్న గారి ఊహాచిత్రమా! భారతీయతను చాటు అక్షరాలెన్ని ఉన్నా- భాష కందని భావమా! హిమాలయ శిఖరోన్నత నీ ఘనతకి- మనసున ఉప్పొంగిన గర్వమా! శాంతి, సత్య, అహింసల- సమరసభావ సుందర త్రివర్ణ పతాకమా! తిరుగులేని త్యాగఫలమా!- తరిగిపోని ధనమా!-నిండు జాతి గౌరవమా! ఎల్లలే లేని నీ చరిత్రను, ఎంతని పొగడ గలను?- ఏమని వర్ణించ గలను? కీర్తి తరగల తుషార బిందువులు, మనసునంతా తడిపివేస్తుంటే, అవనత శిరస్సుతో, ఆనందభాష్పాలతో నీకు వందనమిడుట తప్ప.
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై