మూడు రోజుల ముచ్చటైన పండగ సంబరాలకు కొదవే లేదు, పౌష్య లక్ష్మికి పుష్పాభిషేకం చేయాలని బంతి, చామంతులతో సింగారించి తెల్లవారక ముందే గుడిలో మోగే గంటలు ధనుర్మాస పూజలతో గోదా దేవికి అంగరంగ వైభోగాలు దద్ధోజన నైవేద్యాలు శ్రీకృష్ణుడితో గోపికల సయ్యాటలు అర్చనలతో ఆళ్వారు దేవాల యాలు, నెల రోజులునుంచే సంక్రాంతి వేడుకలు, వీధులన్నీముత్యాలముగ్గులతో రంగవల్లులు తీర్చి దిద్దిన రమణులు, ముగ్గుల్లో గొబ్బిళ్ళుబంతిపూల తోరణాలు బొమ్మలకొలువులుపేరంటాళ్ళు భోగి మంటలు, తలంటు స్నానాలు పసిపిల్లలు భోగిపండ్ల పేరంటాళ్లు, పడతి సౌభాగ్యానికి పసుపు కుంకుమలు, గంగిరెద్దులసన్నాయిమేళాలు మ్రోగిస్తూ హరిదాసులభజనసంకీర్తనలతో ఆనందంవెల్లివిరిసేఅనుబంధాల లోగిల్లు అందరూఒకచోట చేరిఆత్మీయంగా జరుపుకునే సంక్రాంతి ఓకొత్త కాంతి, సంక్రాంతి లక్ష్మికి స్వాగతం"
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై