కాలానుగుణంగా నెల నెలకు రాశి రాశికి రవి పయనం ప్రతి నెలా సంక్రాంతి మకర రాశిలో ప్రవేశం దిశ మారిన భాస్కరాయణం మకర సంక్రమణం!!. ముంగిట ముత్యాల ముగ్గుల అందం బంతిపూల తోరణాల సోయగం భోగి మంటలతో చలికి వీడ్కోలు పిండి వంటలు రుచులు భోగి భాగ్యాల తేరు ప్రజల అనుభవాల తీరు!!. భోగిపండ్లతో సందడి నోముల వ్రతాలతో అతివల ఆనందం పతంగుల కోలాహలం డూడూ బసవన్నల విన్యాసం!!. బొమ్మల కొలువులతో ఇంటింటా సంబరం పాడిపంటలు ఇంటికి చేర రైతన్న కంట వెలుగ ఊరంతా జిలుగు!!. కొత్త అలుళ్లతో ఇల్లంతా సందడి పితృ తర్పణాలతో పితృ దేవతలకు తృప్తి ఆటపాటలతో ప్రజల కన్నుల్లో నిజమైన కాం బ్రతుకు తెరువుపై విశ్వాసం కాలానుగుణంగా మార్పు సహజం!!. పాతను పాతరేసి కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ సరైన దారిలో పయనించినపు క్రాంతి అంటేనే అభ్యుదయం కాంతి ఉంటేనే చైతన్యం కాంతతోనే ఉత్సాహం ప్రకృతి పరిరక్షణనే ధ్యేయం!!! దక్షిణలు ఆశించక పనులు చక్కదిద్దినప్పుడు మార్పు మంచి మలుపుకు దారిదీపమైతే అందరి మదిలో సంక్రాంతి ళలే
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై