నులివెచ్చని భోగిమంటలతో కొలని దేవరకు గొబ్బియలతో కళాత్మకంగా తీర్చిదిద్దిన రంగవల్లులతో కనువిందు చేసే సాంప్రదాయ వస్త్రధారణతో కన్నెపిల్లల కలల సంక్రాంతి!. చిరుమువ్వల గంటల గంగిరెద్దులతో హరిదాసు చిడతల తాళాల సంకీర్తనలతో కళకళలాడే నిండైన ఇంటి సందడులతో ఊరంతా సంక్రాంతి! క్రొత్త బట్టలతో పిండివంటలతో గాలిపటాల ఎగురవేతతో తోటివారితో కలిసిన కేరింతలతో బాలలకు సంతోష సంక్రాంతి! క్రొత్త ధాన్యం రాకతో పొంగలి పరమాన్నాలతో ఇంటిల్లిపాది విందుభోజనాలతో రైతన్నకు సంబరాల సంక్రాంతి! కోడిపందాలతో క్రొత్త చలనచిత్రాలతో కోరికలు తీరే వేళ సరదారాయుళ్లకు సరదాల సంక్రాంతి!. ముచ్చటైన ముగ్గులతో చక్కని బొమ్మల కొలువులతో లి క్రొత్త చీరల రెపరెపలతో మగువల మనసు మురిసే సంక్రాంతి! సంతానం రాకతో ఇల్లంతా కళకళలతో మనవళ్లు, మనవరాళ్ల ముద్దుమురిపాలతో అమ్మ మనసు సంక్రాంతే!
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై