EVENT SUMMARY
అక్షరయాన్ ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్ అధ్వర్యంలో.V Kids High School Nirmal లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అక్షరయాన్ వ్యవస్థాపకురాలైనా శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారు సాహిత్య .,సామాజిక సేవ రంగాలలో విశేషమైన సేవలనీ అందించారు.అందులో బాగంగానే విద్యార్థుల్లో పఠనాసక్తులనీ పెంచాలనే సదుద్దేశంతో సంస్థ నుండి వెలువడినా సలాం సైనిక పుస్తకంపై వ్యాసరచన పోటీలనీ ఏర్పరచి..అక్షరయాన్ ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధియైనా శ్రీమతి తిరుక్కోవెళూరి కిరణ్మయి అధ్వర్యంలో ఈ పోటీలనీ నిర్వహించారు.
ఈ పోటీలో 17 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పుస్తకంలో పరమవీరచక్ర పొందిన అత్యున్నత పురస్కార గ్రహీతలైనా మనదేశ సైనికులపై అక్షరయాన్ కవయిత్రులు తమ తమ కవిత్వంలో అత్యంత అధ్భుతంగా మనదేశ సైనికుల సాహసాన్నీ .,సేవనీ మరియు త్యాగాలనీ కొనియాడారు.
ఈ..పుస్తకాన్ని విద్యార్థులచే చదివించి వారిలోనే అమూల్య భావాలనీ వెలికితీసేందుకు తమదైన తోడ్పాటునీ అందించినా V kids High school కరెస్పాడెంట్ అయిండ్ల గీతాంజలి గారిని..మరియు ప్రిన్సపల్ పురుషోత్తంరెడ్డి గారిని అక్షరయాన్ బృందం అభినందించింది.
విద్యార్థులు ఆయా సైనికుల వీరగాథలనీ చక్కగా వివరిస్తూ.., తమదైన చక్కని వైఖరులలో వ్యాఖ్యానించినందుకు గాను.. .టి.కిరణ్మయి గారు విద్యార్థులకీ
ప్రశంస పత్రాలనీ అందించారు. ప్రథమ .,ద్వితియ .,తృతియ విజేతలకీ నగదు పూర్వక బహుమతినీ అక్షరయాన్ త్వరలోనే అందిస్తుందనీ పేర్కొన్నారు.
EVENT GALLERY
EVENT VIDEOS
RECENT PUBLICATIONS
అక్షరయాన్ – తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్
Post Views: 972