My Profile MY PROFILE Telugu Women Writers Close Chebrolu Sasibala M.A.,B.Ed 0 following 0 followers Profile Details Full NameChebrolu Sasibala M.A.,B.Ed Biographyనా పేరు శశిబాల. నేను M.A.,B.Ed., చేశాను. తెలుగు సాహిత్యం అంటే ఎంతో అభిమానం .ఇష్టం ప్రాణం మా నాన్నగారు గుంటూరు ఏసి కాలేజీలో తెలుగు భాష శాఖాధ్యక్షులుగా చేసి ఉన్నారు వారు మహాకవి.యామినీ బిల్హణీయం, ఉత్తర రామ చరితం వంటి ఎన్నో పద్య కావ్యాలను వారు రాసి ఉన్నారు వారి స్ఫూర్తితో తెలుగు భాష మీద మక్కువ, పెంచుకొని నేను నా రచనా రంగాన్ని ప్రారంభించాను. నేను రెండు వేలకు పైగా కవితలు, 600కు పైగా పాటలు, 200 గజల్స్,శశిమోహన కాంతి కిరణం పేరుతో 150 మినీ ఆర్టికల్స్ ,500 కి పైన సన్మాన పత్రాలు కవితా రూపంలో రాశాను .భక్తి చానల్ కి, SVBC ఛానెల్ కి పాటలు రాశాను.రెండు చిత్రాలకు పాటలు రాశాను. కవితా రూపంలో రాసిన నా సన్మాన పత్రాలకు అద్భుతమైన ప్రజాదరణ లభించింది. సన్మాన పత్రాలను కవితా రూపంలో రాసిన తొలి కవయిత్రిగా నాకు ప్రత్యేక గుర్తింపును, ఘనతను కల్పించింది .ఈ నా ప్రతిభ ఈరోజు ''తానా విశ్వ మహాసభల వేదిక" మీద గౌరవ అతిథి స్థానాన్ని కల్పించింది. నా ఈ రచనా వ్యాసంగం వల్ల నేను అనేక పురస్కారాలను, సత్కారాలను పొందాను.ఎన్నో అద్భుత సాహిత్య,సార్వత్రిక వేదికలపై అతిధిగా మన్నలను పొందాను.అమెరికా హ్యూస్టన్ లో కూడా "నెల నెలా తెలుగు వెన్నెల "వంటి కార్యక్రమాల్లో అతిథిగా గౌరవింపబడ్డాను.తానా అంతర్జాల వేదికపై ఎన్నో కవి సమ్మేళనాలలో,కవిగా,అతిథిగా పాల్గొన్నాను.నేను ఘంటసాల సంగీత కళాశాల కు authorized lyric writer గా,(TTWA)తెలుగు బుల్లితెర రచయితల సంఘంలో EC మెంబర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ట్యూటర్స్ ప్రైడ్ & రాజారత్న సంస్థలో మేనేజ్మెంట్ గ్రూపులో ఉండి వారి సంస్థ కు సేవలు అందిస్తున్నాను. నేను స్వీకరించిన అవార్డులలో ముఖ్యమైనవి... భారత్ కల్చరల్ అకాడమీ వారు ఇచ్చిన మహిళా శిరోమణి అవార్డు,అక్కినేని సంస్థ వారు ఇచ్చిన మహిళా శిరోమణి అవార్డు,TUTORS PRIDE వారు ఇచ్చిన LADY LEGEND OF THE YEAR 2019 అవార్డు ,అక్షరయాన్ తరపున సి.హెచ్ .విద్యాసాగర్ గారు ఇచ్చిన మాతృభాషా దినోత్సవ పురస్కారం ,గిడుగు రామమూర్తి పంతులుగారి పేరిట అందుకున్న గిడుగు రామమూర్తి జీవన సాఫల్య పురస్కారం. ముఖ్యమైనవి. ఇవన్నీ మాత్రమే కాక కీర్తన ఆర్ట్స్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, శ్రీ కీర్తన ఫౌండేషన్ వంటి సాంస్కృతిక సంస్థలను స్థాపించి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి కళామతల్లిని సేవించుకున్నాను. రాగామృత వర్షిణి 1,రాగామృత వర్షిణి 2,రెండు కవితా సంకలనాలు విడుదల చేశాను. భజే సాయినాథం పేరున సాయిబాబా పాటల సిడి,లలిత సంగీతం పాటల సిడి,శ్రీ పోతులూరి వీర బ్రహ్మం గారి పై పాటల సిడి,భక్తి పాటల సిడి లను విడుదల చేశాను. ఇవి నా గురించిన సంక్షిప్త వివరాలు. GenderFemale City/RegionRangareddy Mobile Number9849507991 Social Profiles Account Details