My Profile MY PROFILE Telugu Women Writers Close Inampudi Shreelaxmi (అయినంపూడి శ్రీలక్ష్మి) 0 following 0 followers Profile Details Full NameInampudi Shreelaxmi (అయినంపూడి శ్రీలక్ష్మి) Biographyఅలుపెరగని అక్షర తూణీరం అయినంపూడి శ్రీలక్ష్మి గారు *************** ****** తెలుగు సాహిత్య ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, అక్షరయాన్ సంస్థ అధినేత్రి శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారిది. సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ఆవిడ చేస్తున్న కృషి ఎనలేనిది. స్వతహాగా చిన్న వయసు నుండే సాహిత్య, కళా రంగాలపై మక్కువ పెంచుకుని అక్షరమే శ్వాసగా జీవిస్తూ అనేక పుస్తకాలు వెలువరించడమే కాకుండా, అనువాద రచయిత్రిగా, సంపాదకురాలిగా, షార్ట్ స్టోరీ మేకర్ గా జాతీయంగా ఎంతో పేరుతెచ్చుకున్నను నిగర్వి, సాహితీమూర్తి, నడిచే అక్షరం అయినం పూడి శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మి గారి కొన్ని రచనల వివరాలు: 1. అలల వాన – కవితా సంపుటి -2001 2. దృక్కోణం –కవితా సంపుటి -2003 3. కనకాంబరాలు – సాంస్కృతిక వెబ్ కవితలు 4. లైఫ్ అండ్ చార్మినార్ – దీర్ఘ కవితా సంపుటి -2011-ప్రతిష్టాత్మక ఐదవ కఫిసో జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రత్యెక జ్యూరి అవార్డ్ పొందినది. 5. మోనోలాగ్ ఆఫ్ ఎ వూండెడ్ హార్ట్ దీర్ఘ కవిత -2014- కన్నడలోకి 2017లో, ఇంగ్లీష్ లోకి 2018లో అనువదించబడింది. 6. దర్వాజా మీద చందమామ – 2019- 36 కవితల సంపుటి. 7. కవిత్వమే ఓ గాలక్సీ -2020- 36 కవితల సంపుటి. 8.కొత్త ప్రేమలేఖలు .. 2020 జనవరి ఆకాశవాణి ద్వారా వారం వారం ఏడాది పాటూ ప్రసారమైన సీరియల్ .. విపరీతమైన జనాదరణ పొంది రాజభవన్ లో గవర్నర్ గారే స్వయంగా ఆవిష్కరించిన పుస్తకం 9. ఇట్లు కరోనా .. 2020 ఆగష్టు ఇది కరోనా కాలంలో మనిషికి కరోనా రాసిన సుహృల్లేఖ 10.కనకాంబరాలు .. 2022 ఫిబ్రవరి .. మినీ కవితలు అనువాదాలు: 8. ‘రస్కిన్ బాండ్ -చిల్ద్రెన్ స్టోరీస్’ ను ‘మనం మర్చిపోలేని జంతువులు’ గా -2015 అనువదించారు. 9. ‘ఖలిల్ గిబ్రన్ –సాండ్ అండ్ ఫోమ్’ ను ‘ఇసుకను తోసుకొచ్చిన తీరం-నురగాను మోసుకొచ్చిన కెరటం’ గా -2016 లో అనువదించారు. 10. ‘రస్కిన్ బాండ్- చిల్ద్రెన్ స్టోరీస్’ ను ‘మిమ్మల్ని నవ్వించే కథలు’ గా అనువాదం -2019. 11. ‘మ్రిణాలిని సారాభాయ్’ రచించిన ‘కాన్’ ను అనువాదం- 2022 (విడుదలకు సిద్దంగా ఉంది ) సంపాదకత్వం : 12. ఇందూరు ఉత్సవ ప్రత్యెక విషయాల్లోఎడిటోరియల్ కమిటీ సభ్యురాలిగా 2000 మరియు 2002లో. 13. ఎయిడ్స్ పై 180 మంది మహిళా రచయిత్రులు రాసిన ‘ఆశాదీపం’ కవితాసంకలనంకి ఎడిటోరియల్ సభ్యురాలిగా . 14. ఎయిడ్స్ పై మహిళా రచయిత్రులు రాసిన ‘చిగురంత ఆశ’కథల సంకలనానికి ఎడిటోరియల్ సభ్యురాలిగా . 15. వినియోగదారుల వికాసం కోసం సివిల్ సప్లయి తెలంగాణా ప్రభుత్వంవారు 280 రచయిత/రచయిత్రుల తో తీసిన సంపుటికి ఎడిటర్ గా. 16. మహిళలపై అత్యాచారాలను, హరాస్ మెంట్ ను నిరసిస్తూతీసిన వ్యాస సంపుటి ‘విస్పోటం’ కి ఎడిటర్ గా. 17. లింగ వివక్ష మరియు గృహహింస లకు వ్యతిరేకంగా గళమెత్తిన ‘ధిక్కార’ వ్యాస సంపుటి కి ఎడిటోరియల్ సభ్యురాలిగా. 18. తెలంగాణా ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారు ప్రచురించిన ‘కొత్తసాలు’పుస్తకానికి ఎడిటోరియల్ సభ్యురాలిగా. 19. తెలంగాణా ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారు 442 మంది రచయిత్రుల కవితలతో ప్రచురించిన తొలిపొద్దు కి .. ‘తంగేడు వనం’పుస్తకానికి ఎడిటోరియల్ సభ్యురాలిగా. 20. పల్లె నేపధ్యంలో తీసిన ‘తల్లివేరు’ కవితా సంకలనానికి ఎడిటోరియల్ సభ్యురాలిగా. మచ్చుకు మరికొన్ని సాహిత్యకార్యక్రమాలు: 21. 250 ప్రముఖుల ప్రసంగాల పరంపరను ఆకాశవాణి ద్వారా నిర్వహించారు. 22. కళారాధన కార్యక్రమం క్రింద 16 గురు సాహితీమూర్తుల పరిచయాలు ఆకాశవాణి లో నిర్వహించారు. 23. ఎయిడ్స్ గురించి, వినియోగదారుల హక్కుల గురించి తదితర కార్యక్రమాల్లో మూడువందలకు పైగా రచయిత్రులకు శిక్షణా శిబిరాలు నిర్వహించి సంపాదకత్వం వహించి, అందరి రచనలతో పుస్తక సంకలనాలు వెలువరించారు. 24. ఎన్నో సింపోజియం లలో, సాహితీకార్యక్రమాల్లో, జాతీయ అనువాదాలలో పాల్గొని సాహితీ సేవలు చేసారు. 25. ‘అక్షరయాన్’ సంస్థను స్థాపించి, కేవలం తను రచించడమే కాక రెండు తెలుగురాష్ట్రాల నుండి, విదేశాలనుండి కూడా ఎందరో రచయిత్రులను వెలుగులోకి తెచ్చారు. చాలా సంకలనాలు ప్రచురించారు. పురస్కారాలతో బాలలను, పెద్దలను, వరిష్ట రచయిత్రులను, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నారు. GenderFemale City/RegionHyderabad Mobile Number99899 28562 Full AddressInampudi Shreelaxmi, 1002, Royal Pavilion Aparts, Opp. Reliance Smart Bazar, Ameerpet, Hyderabad-500 016. Awardsతెలంగాణ రాష్ట్ర పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభ, కీర్తి పురస్కారాలు, సినీ-టీవీ ‘నంది’ పురస్కారాల జ్యూరీ సభ్యురాలిగా రెండు దఫాలు Novels4 కవితా సంపుటులు Stories2 దీర్ఘ కవితలు Translations3 అనువాదాలు Publications2 లేఖా సాహిత్య రచనలు-కొత్త ప్రేమలేఖలు, సుహృల్లేఖ Social Profiles Account Details