My Profile MY PROFILE Telugu Women Writers Close Dr. D Sharada 0 following 0 followers Profile Details Full NameDr. D Sharada Biography*కవయిత్రి పరిచయం* డాక్టర్. శారదాహన్మాండ్లు 1969 లో జన్మించారు. వీరు నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు. వీరి తల్లిదండ్రులు దొడ్లె. విజయలక్ష్మి , వెంకటయ్య. భర్త బోడ.హన్మాండ్లు, ఉపాధ్యాయులు. కుమారుడు నరేన్. కోడలు సింధూజ. కూతురు వైష్ణవి. అల్లుడు రాపోలు.సుభాష్ చంద్రబోస్. మనుమడు విశ్వంజయ్, మనమరాలు ఈశప్రియ. డా. శారదా హన్మాండ్లు M.A,B.Ed,Ph,D పట్టాను పొందారు. తెలుగు ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. ఈమె మొదటి వచన కవితాసంపుటి మనోదర్పణం. రెండవ వచన కవితాసంపుటి ఎర్ర గాజులు. 'బతుకమ్మ- సాంస్కృతిక పునరుజ్జీవనం- ఒక పరిశీలన' అన్న అంశంపై పరిశోధన చేసి తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను పొందారు. వ్యాసాలు కథలను కూడా రాస్తున్నారు. Blog aksharaprasoonam.blogspot.com ను నిర్వహిస్తున్నారు. చీలం జానకీబాయి రచయిత్రుల సంఘానికి అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. బతుకమ్మపై విభిన్న కోణాల్లో రాసిన వ్యాసాలు పలు పత్రికల్లో అచ్చయినవి. హరితహారంపై రాసిన కవిత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ద్వితీయ బహుమతి అందుకున్నారు. బాల సాహిత్యం, దేశభక్తి గేయాలు, రేడియో ప్రసంగాలు, ఎన్నో పుస్తకాలకు పీటికలు, సమీక్షలు రాశారు. తెలంగాణ నూతన పాఠ్య పుస్తకాల రూపకల్పనలో భాగం పంచుకున్నారు. నిజామాబాద్ జిల్లా సావనీర్ల రచన కమిటీలో భాగం పంచుకున్నారు. నిజామాబాద్ జిల్లా సమగ్ర చరిత్ర రచన కమిటీలో పాలుపంచుకున్నారు. అక్షరయాన్ నిజామాబాద్ జిల్లా విభాగాన్ని నడిపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో జరుగు సాహిత్య కార్యక్రమాలలో తమ వంతు బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు. GenderFemale City/RegionNizamabad Date Of Birth01-03-1969 Mobile Number9912275801 Full Address3-10-305/3, Vivekananda Nagar, Nizamabad Social Profiles Account Details