ప్రముఖ కథారచయిత్రి, ప్రసిద్ధ అనువాదకురాల
బామ్మరూపాయి కథతో ప్రఖ్యాతురాలు అయ్యారు. తులసి కథలు, యాత్ర, సాహితీ తులసి, ఇత్యాది రచనలు ప్రముఖమైనవి.
1991లో తులసి కథలకు ఉత్తమ కథారచయిత్రి పురస్కారం అందుకున్నారు.
ఒడియా, ఇంగ్లీషు, హిందీ నుండి చేసిన ఆమె అనువాదాలు ప్రామాణిక రచనలుగా ప్రముఖులచేత ప్రశంసించబడ్డాయి.
అనువాద రచనల్లో ఓల్గా నుంచి గంగకు (రాహుల్ సాంస్కృత్యాయన్ ఓల్గా సే గంగా)
మహాదేవివర్మ గీతాలు (జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత మహాదేవివర్మ రచనలు)
బ్రహ్మరాక్షసుడు (ఒడియా నాటకం - రచయిత హృషికేశ్ పండా) ముఖ్యమైనవి.
తదితర సాహిత్య ప్రక్రియలలో కూడా ఈమెకలం బలమైనదే. సాహిత్యవ్యాసాలు, ఏకాంకికలు, నవలికలు, కవితలు రచించారు. ఈమె కథలు ఇంగ్లీషు, హిందీ, ఒడియా, మరాఠీ, ఉర్దూ, మళయాళం, కన్నడ తదితర భాషల్లోకి అనువాదం అయి ఆయా భాషలలోని కథానిక సంకలనాలలో ప్రచురించబడి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాయి.
మౌళిక రచనలు, అనువాద రచనలు మొత్తం 30 పుస్తకాలు అచ్చు అయ్యాయి.
మౌళిక రచనలు, అనువాద రచనలు మొత్తం 30 పుస్తకాలు అచ్చు అయ్యాయి.
కథకురాలుగా, సాహితీవేత్తగా పలు పురస్కారాలు అందుకున్నారు. మంచి వక్తగా పేరుతెచ్చుకున్నారు.
తండ్రి చాసో పేరుమీద 1994లో చాసో స్ఫూర్తి సాహిత్య ట్రస్టు వ్యవస్థాపకురాలుగా 1995 నుండి ప్రతీఏటా చాసో జన్మదినం జనవరి 17 నాడు ఉత్తమ సాహిత్య స్రష్టలను పురస్కరిస్తూ చాసో అభ్యుదయ భావాలను ప్రసరింపచేస్తున్నారు. చాసో రచనలను ప్రచురిస్తున్నారు.