నమస్కారం,
పుట్టింది,కొంతవరకు పెరిగింది, మద్రాస్ లో ఆ తరువాత హైస్కూల్,కాలేజీ జీవితం, రాజమండ్రి లోను,
వివాహం అయినప్పటి నుంచి హైద్రాబాద్ లో నివాసం.
బాల్యం నుంచి మా నాన్నగారు,అమ్మగారి ల ద్వారా, పుస్తకాలు చదవడం అలవాటు అయింది. నాన్నగారికి ఎందరో ప్రముఖ సాహితీవేత్తలతో పరిచయం ఉండేది.
తెలుగు కథను అంతర్జాతీయ స్థాయి లో తీసుకెళ్ళిన మహా రచయిత శ్రీ పాలగుమ్మి పద్మ రాజు గారు భీమవరం లో నాన్నగారికి గురువులు. వారి మధ్య వారి గురుశిష్య బంధం గాఢమైన దిగ ఉండేది. అలాంటిi సందర్భం లో వారిని చూడటం కలవడం మాట్లడటం జరిగింది.,
అలా ముఖ్యంగా కథా,నవలా సాహిత్యం పట్ల అబిలాష పెరిగింది. వివాహానంతరం శ్రీవారి వల్ల, అమ్మ లాంటి అత్తగారి తోడ్పాటుతో నా సాహిత్యాభిలాష నిర్విఘ్నంగా కొనసాగింది.
2010 వరకు ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థలో పని చేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసాను..
కథలు రాయాలనే అభిలాషతో రాసిన తొలి కథ “కృష్ణం వందే జగద్గురుం” కౌముదిలో ప్రచురిచతమైంది. వారికి అనేక ధన్యవాదాలు
ఇప్పటి దాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా డెబ్బై ఐదు పైనే, (75).
నా కథలు ప్రముఖ వార, మాస పత్రిక ల తో పాటు విశాలాంధ్ర వారి దీపావళి సంచికలోనూ మరియు అన్ని ప్రముఖ అంతర్జాల పత్రికల లోను ప్రచురించబడి పాఠకుల మన్ననలు పొందుతున్నాయి
చాల కథలకు బహుమతులు కూడా వచ్చాయి..
అలాగే కొన్ని కథా సంపుటాలలో కూడా కథలు ప్రచురించ బడ్డాయి.,
ప్రముఖంగా కొత్త కథ 2018,
వంగూరి వారి ఫౌండేషన్ నుంచి వచ్చిన సంకలనాలలో వరుసగా నాలుగేళ్ళ నుంచి కథలు ప్రచురించ బడ్డాయి.
అచ్చంగా తెలుగు ప్రచురణలో ని కథా సంకలనం, అరవై మంది రాసిన గొలుసు నవల,
ప్రియమైన రచయిత ల వారి సంకలనం లో కూడ కథలు ప్రచురించ బడ్డాయి.
గుర్తింపు తెచ్చిన కథలు, కొన్ని
వాత్సల్య గోదావరి, మానిక్వీన్,రెయిన్ బో టైలర్స్,జీళ్ళసూరిబాబు,(ప్రముఖ రచయిత యండమూరి గారికి నచ్చిన కథలు) దేవ కాంచనం.ముళ్ళపూలు,ఆమె గెలుపు చినుకు మాస పత్రిక లో ని వాడు-నేను,లాంటి మొదలయిన కథలు.
బహుమతి కథలు
1.గో తెలుగు.కాం వారి హాస్యకధల పోటిలో ప్రధమ బహుమతి వచ్చింది
2 ఫేస్బుక్ లోని కధా గ్రూప్ నిర్వహించిన కధల పోటిలో ప్రధమబహుమతి వచ్చింది.
3. అమెరికా తెలంగాణా సంఘం(ATA) వారి సావనీర్ కు పెట్టిన కధల పోటిలో నా కధ కి మొదటి బహుమతి వచ్చింది.
4. వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన కథల పోటీ లో ప్రధమ బహుమతి వచ్చింది.
4.విశాఖ సంస్కృతి కథల పోటీలో బహుమతి వచ్చింది.
5 కథామంజరి అంతర్జాల పత్రిక వారు నిర్వహించిన కథల పోటీలలో రెండుసార్లు బహుమతి వచ్చింది.
6. సహరి అంతర్జాల వార పత్రిక వారు నిరహించిన కథల పోటీలో బహుమతి వచ్చింది.
7. లేఖినీ సాహితీ సమాఖ్య వారు నిర్వహించిన కథల పోటీలో ప్రధమ బహుమతి వచ్చింది.
8. తెలుగు డే కెనడా వారి నిర్వహించిన కథల పోటీలో బహుమతి వచ్చింది.
నవలలు
చతుర మాసపత్రికలో తొలి నవల “జీవితం ఓ ప్రవాహం” ప్రచురితమయింది.
రెండవ నవల 'కాశీపట్నం చూడరబాబూ' జాగృతి వారపత్రికలో ధారావాహికగా ప్రచురితమయింది.
మూడవ నవల ‘ప్రయాణం’ ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం లో ప్రచురిచతమయింది. .
ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వేసాను.
మొదటి పుస్తకం వాత్సల్య గోదావరి కథా సంపుటి
రెండవది కాశీ పట్నం చూడరాబాబు నవల
మూడవది మనం కథా సంపుటి
నాలగవది గెలుపు గాయాలు కథా సంపుటి
లేఖిని ,అక్షరయాన్ ,అచ్చంగా తెలుగు వంటి సంస్ట్లలో సభ్యులు గ ఉండటం వల్ల ఇతోధికంగా సాహిత్యాభి వృద్ధికి తోడ్పడే అవకాశంలబించింది. అలాగే సాహిత్య సభలలో పాల్గొనడం చాల ఆసక్తి,,ఇష్టం,