జల
ఒక సృజనకారుడు బహుముఖంగా ఎలా ఎదగాలో చెప్పడానికి, ఎంత అధ్యయనముండాలో చెప్పడానికి తన ఏ ప్రసంగము విన్నా తెలుస్తుంది. అచ్చమైన తెలంగాణతనంతో నిండిన ఒక సాహితీవేత్త ఎట్ల ఉంటడో, ఎట్ల ఉండాలో చెప్పడానికి హరికృష్ణన్ననే ఒక ఉదాహరణ.
హరికృష్ణన్న సాహిత్యాన్నంతా అధ్యయనం చేసిన తరువాత తన కవిత్వ మూలాల గురించి మాట్లాడుకున్న మాటలే ఈ పుస్తకం.
సుషుప్తి నుంచి - లేపాక్షి పుస్తకంలో దాచుకున్న యవ్వనపు రక్తం.
ఒంటరీకరణ - తనలోకి తాను ప్రయాణించిన కాలం
ఊరికి పోయిన యాళ్ళ - బురదనేలలో తిరుగాడిన జీవితం.
మూడూ భిన్న దశలు. భాషలో, అభివ్యక్తిలో ఒక్కో దశలో ఎన్నో వరిణామాలు. ఈ దశల్లో తన కవిత్వంలోని వస్తువు, శిల్పంలో వచ్చిన మార్పుల గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నం ఇది. ”
-తగుళ్ళ గోపాల్
డా॥ మామిడి హరికృష్ణతో తగుళ్ళ గోపాల్
కవిత్వపు ముచ్చట్లు