బతుకమ్మ
Every Country or nation has its own distinct culture. And the culture can be showcased, exhibited, identified, manifested, interpreted and highlighted by one collective action, i.e., festival. A festival is an outcome of the overall needs, experiences, experiments and wishes of a community/society living in a specified area, and continues for generations. In this process, any festival will develop few rituals, traditions, practices specialized for itself by which that festival got unique significance among other festivals.
పై మాటలకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచే పండుగ బతుకమ్మ!
బతుకమ్మ ఒక పూల పండుగ! చెరువుల పండుగ, ఇది మహిళల పండుగ! పర్యావరణ పండుగ... ఇంకా లోతుగా వెళ్లి చూస్తే ఇది ప్రకృతికి ఒక కృతజ్ఞతలు తెలిపే పండుగ!
జీవితాన్ని ఇచ్చిన ఆడబిడ్డలకు, అమ్మలకు మనం చెప్పే ధన్యవాదాల పండుగ! మొత్తంగా సకల చరాచర సృష్టికి మానవాళి అందించే ఒక "థాంక్స్ గివింగ్" పండుగ బతుకమ్మ!
బతుకమ్మ తెలంగాణ మహిళా శక్తికి నిలువెత్తు ప్రతీక!
తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక!
తెలంగాణ ఆత్మగౌరవ జీవిక!
తెలంగాణ జన జీవన వేదిక!
తెలంగాణ సాంస్కృతిక గీతిక!
బతుకమ్మ పండుగను ఒక సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంప్రదాయక, ఆధ్యాత్మిక, పర్యావరణ పరమైన, సంగీతనాట్యపరమైన అంశాలన్నింటిని మేలు కలయికగా అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటినీ ఒక్కచోట గుదిగుచ్చి సమర్పించాలనేది తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంకల్పం! ఆ దిశగా బతుకమ్మలోని బహుముఖాలను ఆవిష్కరించడానికి 'అక్షరయాన్' మహిళా రచయిత్రుల వేదిక సహకారంతో "ఒక్కొక్క పువ్వేసి సందమామ" పేరుతో 2024లో సమగ్ర వ్యాససంపుటిని పుస్తకంగా ప్రచురించడం జరిగింది.
తెలంగాణ అంటేనే పండుగల నేల!
ఉత్సవాల హేల!
సామూహిక జన జాతరల మేళా!
వేలాది సంవత్సరాల క్రితం ఈ నేలపై పుట్టి, ఈ మట్టి నుంచి ఎదిగి, ఈ మనుషులతో పాటు సహజీవనం చేస్తూ ఎప్పటికప్పుడు తన లక్ష్యాన్ని, గమ్యాన్ని, గమనాన్ని మార్చుకుంటూ ఆత్మని కోల్పోకుండా ఆధ్యాత్మిక స్ఫూర్తిని విస్మరించకుండా తెలంగాణ ప్రజలందరినీ, ఆడబిడ్డలందరినీ ఒక్కతాటిపై నిలుపుతున్న మహోన్నత ఉత్సవం బతుకమ్మ పండుగ. అలాంటి శిఖరాయమానమైన పండుగకి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ అందిస్తున్న అక్షర నీరాజనం ఈ పుస్తకం. డా. మామిడి హరికృష్ణ
- డా. మామిడి హరికృష్ణ