ప్రపంచ కవిత
ఈ ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు" (No two individuals are alike in this world) అనేది జైవికంగా (Biological), మానసికంగా (Psychological) ఎంత సత్యమో, ఒక దేశం మరో దేశానికి కాపీ కాదని, ఏ ప్రాంతం మరో ప్రాంతానికి నకలుగా ఉండలేదనేది కూడా అంతే వాస్తవం అనేది కూడా! అందుకే దేశాల మధ్య. ລ້ ລ້ ໖ (Similarities). తారతమ్యాలు (Comparisons) కంటే, వారివారి 252 (Uniqueness), 32 (Diversity) as it is ఆలోచనే సమ్యక్ జీవన విధానానికి సరైన మార్గంగా కనిపిస్తుంది.
"ఒక ప్రాంతపు మనిషి, మరొక ప్రాంతం మనిషికి సంపూర్ణంగా అర్థం కాడు" (A man can't be understood by the other completely) ৬৯! అలాగే ఒక ప్రాంత జీవన సంస్కృతి, భాష, సాహిత్యం మరో భాషలోకి లేదా మరో ఉద్వేగం (Emotion) లోకి తర్జుమా చేయడానికి అంతగా సాధ్యం కాదు అనేది కూడా!
అలాగే ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, యురేషియా ప్రాంతపు జీవన సంస్కృతులని, సాహిత్యాన్ని, ప్రాంతాలని అధ్యయనం చేస్తున్న క్రమంలో ప్రపంచం మొత్తం మీద ఉండే మానవ భావోద్వేగాలు అన్నీ దాదాపుగా ఒకటే అనే విషయం బోధపడుతుంది. రంగు, రుచి, వాసన, రూపు, రేఖా లావణ్యాలు, పరిస్థితులు, పరిణామాలు, సంఘటనలు, సన్నివేశాలు, వేదనలు, విప్లవాలు, వివరణలు, సంఘర్షణలు ఇవన్నీ వేర్వేరుగా ఉండొచ్చు. కానీ ఈ పరిస్థితుల పట్ల వివిధ దేశాలు జాతులు, భాషల ప్రజలు మాత్రం ఒకేలా స్పందిస్తారనే విశ్వజనీన (Universality) తత్వాన్ని ఆవిష్కరించిందే ఈ "ప్రపంచ కవిత"!
- డా. మామిడి హరికృష్ణ